Welcome to Telugu News Features web portal

Editor: A. Radha Devi

శ్రీమద్భగవద్గీత ఒక జీవన పాఠ్య గ్రంధం: డా.గజల్ శ్రీనివాస్

పాలకొల్లు: ప్రపంచ భాషలలో సంపూర్ణ శ్రీమద్భగవద్గీత ఆడియో ను రూపొందించడమే తన లక్ష్యమని , ఇప్పటికే 25 భాషల్లో రికార్డింగ్ పూర్తి అయ్యిందని , శ్రీమద్భగవద్గీత యూట్యూబ్ , ఇతర మాధ్యమాల ద్వారా ఉచితంగా వినవచ్చునని, పల్లె పల్లె కు, గుండె గుండె కు , ఖండఖండాతరాలకు గీతను చేర్చాలన్నదే నా ఆశయమని శ్రీమద్భగవద్గీత తెలుగు ఆడియో లోకార్పణ సభలో డా.గజల్ శ్రీనివాస్ అన్నారు. తన స్వస్థలమైన పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన గీత ఆవిష్కరణ సభలో డా
గజల్ శ్రీనివాస్ తండ్రిగారు శ్రీ కేశిరాజు నరసింహారావు (93) చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ స్వరపరిచి, గానం చేసిన శ్రీమద్భగవద్గీత ఆవిష్కరణ జరిగింది.

ఈ సభలో పూర్వ శాసన సభ్యులు డా. సి.హెచ్. సత్య నారాయణ మూర్తి, పూర్వ శాసన మండలి సభ్యులు శ్రీ అంగర రామ మోహన్, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ అధ్యక్షులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ, కళారత్న శ్రీ రసరాజు, రోటరీ అంతర్జాతీయ డైరెక్టర్ డా. వడ్లమాని రవి , సేవ్ టెంపుల్స్ భారత్ సభ్యులు శ్రీ మేడికొండ శ్రీనివాస్, అడ్డాల వాసుదేవరావు, శ్రీ ముచ్చర్ల సత్య నారాయణ, శ్రీ విఠకుల రమణ, శ్రీ రెడ్డప్ప ధవీజీ , మాంటిస్సోరి వర్మ , శ్రీ తటవర్తి కృష్ణ మూర్తి , స్థానిక పెద్దలు , పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సభలో పాల్గొని డా.గజల్ శ్రీనివాస్ గీతా గాన యజ్ఞాన్ని అభినందించారు.

Latest News