
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు.. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం 126 మందికి చోటు కల్పించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మిషన్ 150 ప్లస్‌కు శ్రీకారం చుడుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. సర్వే చేసి అభ్యర్థులను ఖరారు చేశామన్నారు. తమని సుపరిపాలనే గెలిపిస్తుందన్నారు. కులానికీ, మతానికి సంబంధం లేకుండా పని చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.