Welcome to Telugu News Features web portal

Editor: A. Radha Devi

తెరాస కండువావేసుకోనున్న తుమ్మలను ఓడించిన ఉపేందర్ రెడ్డి


తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఊహించ‌నంత వేగంగా సాగుతోంది. ముఖ్య‌నేత‌ల‌కు గులాబీ కండువా కప్పే బిజీలో అధికార టీఆర్ఎస్ పార్టీ బిజీ బిజీగా ఎత్తులు వేస్తోంది. ఈ ఎత్తుల్లో భాగంగా తాజా మ‌రో కీల‌క నేత పార్టీ వీడారు. అది కూడా కీల‌క‌మైన ఖ‌మ్మం జిల్లా నుంచి కావ‌డం గ‌మనార్హం. సీఎల్పీ నేత భ‌ట్టివిక్ర‌మార్క ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు టీఆర్ఎస్‌లో చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇదే ఒర‌వ‌డిలో తాజాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారు.
పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన తుమ్మల గెలుపొందారు. ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేశారు. కానీ ప్రజలతో కలివిడిగా ఉండకపోవడం, అందుబాటులో లేకపోవడం ఆయనకు ప్రతికూలంగా మారింది. దీంతో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుపై కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున విజయం సాధించారు. తుమ్మ‌ల‌పై 1950 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి గెలుపొందారు.
కాగా, తాజాగా ఉపేంద‌ర్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ భేటీలో పార్టీ మార్పు త‌దిత‌ర అంశాల గురించి ఉపేంద‌ర్‌రెడ్డి, కేటీఆర్ చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా త్వరలో టీఆర్ఎస్ పార్టీ చేరుతున్నట్లు ఉపేంద‌ర్ రెడ్డి ప్రకటించారు. ఇదిలాఉండ‌గా, ఉపేంద‌ర్ రెడ్డి గులాబీ గూటికి వ‌స్తున్న నేప‌థ్యంలో, మాజీ మంత్రి తుమ్మ‌ల ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే

Latest News