Welcome to Telugu News Features web portal

Editor: A. Radha Devi

ప్రియ ప్రకాష్ వారియర్‌ కౌంటర్


కన్ను గీటే వీడియోతో సూపర్ పాపులారిటీ సంపాదించిన ప్రియ ప్రకాష్ వారియర్‌కు ఇప్పుడు పూర్తి ప్రతికూల పరిస్థితులు నడుస్తున్నాయి. పోయినేడాది 30 సెకన్ల ఆ వీడియోతో ఊహించని పాపులారిటీ రావడంతో దాన్ని ఉపయోగించుకుని చాలా యాడ్స్ చేసింది. కొన్ని సినిమా అవఖకాశాలు కూడా అందుకుంది ప్రియ. కానీ ఆమె తొలి సినిమా ‘ఒరు అడార్ లవ్’ రిలీజయ్యాక సీన్ రివర్స్ అవుతోంది. ఈ చిత్రంలో ప్రియ పెర్ఫామెన్స్ గురించి చెప్పడానికేమీ లేకపోయింది. సినిమా కూడా చెత్తగా ఉండటంతో ప్రియ మీద నెగెటివిటీ మొదలైంది.
ఇది చాలదన్నట్లు ‘ఒరు అడార్ లవ్’ టీం అంతా ఆమెకు యాంటీగా తయారైంది. ఆల్రెడీ ఇందులో హీరో రోషన్, రెండో కథానాయికగా నటించిన నూరీన్.. ప్రియ విషయంలో నెగెటివ్ కామెంట్స్ చేశారు. తాజాగా దర్శకుడు ఉమర్ లులు అయితే ప్రియ మీద విరుచుకుపడ్డాడు. ఆమె నటన విషయంలో ఎందుకూ పనికి రాదని తేల్చేశాడు.
దీంతో ప్రియ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఆమె పాపులారిటీ బుడగ పేలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఐతే వరుసబెట్టి తన మీద నెగెటివ్ కామెంట్స్ పడుతుండటంతో ప్రియ అప్రమత్తమైంది. ఉమర్‌కు హెచ్చరికలు పంపేలా వ్యాఖ్యలు చేసింది. ప్రియ కోస‌మే ఒరు అడార్ ల‌వ్ క‌థ‌ను మార్చాల్సి వ‌చ్చింద‌ని.. ఆమె ప్ర‌మోష‌న్ల‌కే రాకుండా సినిమాకు అన్యాయం చేసింద‌ని ఉమ‌ర్ విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ప్రియ స్పందిస్తూ.. ఒరు అడార్ ల‌వ్‌కు సంబంధించి అసలేం జరిగిందో చెబితే కొందరి పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిళ్లుతుందని అంది.
త‌న గురించి ఆరోప‌ణ‌లు చేస్తున్న వారికి భవిష్యత్తులో క‌ర్మ తగిన సమాధానం చెబుతుందని చెప్పింది. ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని పేర్కొంది. ఎవరి పేరూ ఎత్తకుండా ప్రియ చేసిన వ్యాఖ్యలపై ఉమర్ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి. అటు వైపు నుంచి మళ్లీ విమర్శలు వస్తే.. ప్రియ కొంచెం గట్టిగానే సమాధానం చెబుతుందేమో.

Latest News