Welcome to Telugu News Features web portal

Editor: A. Radha Devi

తప్పు చేసిన ప్రియా వారియర్.

కన్ను కొట్టి దేశంలోనే పాపులర్ అయిన కొంటె చూపుల హీరోయిన్ ప్రికాశ్ వారియర్, అత్యాశకు పోయి వచ్చిన ఛాన్సులకు నో చెప్పి తప్పు చేసింది.సినీ ఇండస్ట్రీలో భాష, ప్రాంతం అని తేడా లేకుండా తన ఓర చూపులతో కన్నుగీటి జనాలకు నిద్ర పట్టకుండా చేసిన ప్రియా ప్రకాశ్ వారియర్ రాత్రి రాత్రే స్టార్ నటిగా మారి పెద్ద క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. తమిళంలో ప్రియా వారియర్ నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ తెలుగు లో ‘లవర్స్ డే’గా రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రం రెండు భాషల్లో పెద్దగా హిట్ కాలేదు. ‘ఒరు ఆదార్ లవ్’ సినిమా రిలీజ్ కి ముందు హీరోయిన్ ప్రియా వారియర్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది.అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. కానీ తన మొదటి చిత్రం మంచి హిట్ అయితే తర్వాత తన పాపులారిటీ మరింత పెరిగిపోతుందని భావించి వచ్చిన చాన్సులు అన్నీ వదులుకుంది. ఈ చిత్రం పరాజయంపాలు కావడంతో ఇప్పుడు ఒక్క ఛాన్సు కూడా లేకుండా పోయింది. పైగా ప్రియా వారియర్ పై సహనటి నూరిన్ చేసిన విమర్శలు మరిచిపోకముందే, దర్శకుడు ఒమర్ లులూ మరికొన్ని ఆరోపణలు చేశాడు. ఈయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్నాయి.

Latest News