Welcome to Telugu News Features web portal

Editor: A. Radha Devi

టీడీపీకి బిగ్ షాక్ వైసీపీలోకి 36 మంది ఎమ్మెల్యేలు..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలోఉన్న తెలుగుదేశం పార్టీకి భారీ షాక్తగులుతోంది. ఆ పార్టీ సీనియర్ నేతలు, త్వరలో ప్రతిపక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీతీర్థం పుచ్చుకోనున్నారు. ప్రతిపక్షనేతతో రేపో,మాపో భేటీ కానున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు నేతలు వివిధకారణాలతో పార్టీలు మారుతున్న విషయంతెలిసిందే. ఇటీవల్లనే కడప జిల్లా రాజంపేట నియోజవర్గం టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీలోచేరారు. తాజాగా ఒకేరోజు ప్రకాశంజిల్లా చీరాలఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి ఇద్దరు రాజీనామా చేశారు. ఒకరు త్వరలో వైసీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మరోకరు రేపో మాపో వైసీపీలో చేరికపై ప్రకటించే అవకాశం ఉనట్లు సమచారం. ఏపీ రాష్ట్రవాప్యంగా అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే 36 మంది వైసీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది. దానికి కారణాలు కూడ క్రింద కామెంట్లల్లో వారు పెట్టడం చర్చనీయాశం అయ్యింది. అది ఏమీటంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్ భారీ విజాయాన్ని అందుకోబోతున్నాడని తెలిసి వైసీపీలో చేరుతున్నారని చేబుతున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది వైసీపీలో చేరుతున్న ఆ 36 మంది టీడీపీ ఎమ్మెల్యేలే ఎవరు అని…?

Latest News