Welcome to Telugu News Features web portal

Editor: A. Radha Devi

ఓపిక నశించిన బాధిత మహిళలు

దూదేకుల సొసైటీ రాష్ట్ర చైర్మన్‌ బాబన్‌ను చుట్టుముట్టిన మహిళలు…దూదేకుల ఫెడరేషన్‌ పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసుకుని రూ.3 వేలు చెల్లిస్తే రూ.30 వేలు సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో 15 మంది గ్రూపుగా ఏర్పడి రుణాలకు అవసరమైన కుల, ఆదాయ, తదితర ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకున్నారు. రుణాల ఆశచూపి సభలకు, సమావేశాలకు మూడేళ్లుగా తిప్పుకున్నారు. ఓపిక నశించిన బాధిత మహిళలు ఆదివారం నగరంలో జరిగిన దూదేకుల జాబ్‌మేళాను వేదికగా నూర్‌బాషా కో ఆపరేటివ్‌ సొసైటీ నాయకులను నిలదీశారు. దీంతో నేతలంతా మాటమార్చగా…ఓట్లు అడిగేందుకు వస్తారుగా… అప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు.

అనంతపురం: సొసైటీల పేరుతో రుణాలందచేస్తామని సమావేశాలకు పిలిపించుకుని ఇప్పుడు రుణాల ఊసే ఎత్తడం లేదని పలువురు మహిళలు నూర్‌బాషా కో ఆపరేటివ్‌ సొసైటీ నేతలను నిలదీశారు. వివరాల్లో కెళ్తే.. అనంతపురం నగర సమీపంలోని దూదేకుల కమ్యూనిటీ హాలులో ఆదివారం దూదేకుల యువతీయువకులకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు ప్రతికా ప్రకటనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అనంతపురంతో పాటు కర్నూలు, కడప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యువతీయువకులు హాజరయ్యారు. సమావేశంలో దూదేకుల సొసైటీ రాష్ట్ర చైర్మన్‌ సి.బాబన్, జిల్లా అధ్యక్షుడు దాదాఖలందర్, జిల్లా మైనార్టీ కార్పొరేషన్‌ ఈడీ బాబా తాజుద్దీన్‌ తదితరులు మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన పథకాలతోపాటు, సంఘం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. నాయకుల ప్రసంగాలు పూర్తయినా రుణాల ఊసేత్తలేదు

Latest News