హైదరాబాద్‌లోని అహోబిలమఠంలో ఘనంగా నృసింహ జయంతి వేడుకలను నిర్వహించారు. నృసింహజయంతిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి విశేష తిరుమంజనం, కళ్యాణం ఇతర వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తజనులంతా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించారు.
