టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియాపై పాక్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన నఫీసా అత్తారి అనే ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు.. పాక్ క్రికెట్ జట్టు విజయం అనంతరం సంబురాలు చేసుకుని ఉద్యోగాన్ని కోల్పోయింది. స్థానికంగా ఉండే నీర్జా మోదీ అనే స్కూల్‌లో పనిచేసే నఫీసా.. పాక్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తన వాట్సాప్‌లో స్టేటస్ పెట్టింది.
