Welcome to Telugu News Features web portal

Editor: A. Radha Devi

లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే బీరువా ఎక్కడ ఉండాలి ?

డబ్బు, డబ్బు, డబ్బు, మనిషి జీవితంలో ముఖ్యమైనది ప్రేమానుబంధాల తరువాత డబ్బే. కొన్ని సంధర్భాల్లో ఈ డబ్బే అనుబంధాలను కూడా మించిపోతుంది. అలాంటి ధనాన్ని నిల్వ చేసుకునే బీరువాను ఇంటిలో ఎటువైపు ఉంచాలి.
ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ గది ఏ వైపు ఉండాలో నిర్ధేశించినట్లే బీరువా వంటి ముఖ్యమైన వస్తువులు ఎక్కడ ఉండాలో మన పూర్వీకులు నిర్ణయించారు.
ప్రతి ఒక్కరు బీరువా ఈ దిక్కున ఉండకూడదు ఆ దిక్కున ఉండకూడదని చెబుతున్నారు. ఏ దిక్కున బీరువా పెడితే డబ్బులు నిల్వ ఉంటాయి… ఏ దిక్కున పెడితే డబ్బులు వస్తాయన్న విషయాన్ని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. అయితే వాస్తు నిపుణులు మాత్రం ఇలా చేస్తే డబ్బులు, నగలు బాగా వస్తుందంటున్నారుముఖ్యంగా నైరుతి పక్కన డబ్బులు, నగలు పెడితే ఇబ్బందులు తప్పవంటున్నారు. అలా పెడితే బీరువాలో నగలు, డబ్బులు అస్సలు పెరగవట. కానీ ఉత్తర వాయువ్యంలో బీరువా పెడితే మంచిదట. ఉత్తరం గోడ, పడమట గోడ ఈరెండు కలిసిన మూలమే వాయువ్యం అంటారు. అందులో ఉత్తరానికి బీరువా వెనుక చూసే విధంగా డబ్బులు, నగలు పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి..వెళ్ళాలి అనుకుంటుందట. ఉత్తరవాయువ్యంలో బీరువా పెట్టి డబ్బులు, నగలను పెడుతూ, తీస్తూ ఉంటే ధనం పెరగడమే కాకుండా ఇంట్లో సంతోషంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కొందరు ఇంటికి రాగానే జేబులో ఉన్న చిల్లరను తీసి ఏ బల్లపైనో, లేదంటే అలమారలోనో, కాకపోతే డైనింగ్ టేబుల్ పై పెట్టేస్తాము. ఇక స్త్రీల సంగతి చెప్పనక్కర్లేదు. పోపుల డబ్బాల్లో పడేస్తారు. అది కాదంటే కూరగాయలు పెట్టె బేసిన్లో ఈ డబ్బులు కూడా కలిపేసి పోసేస్తారు.
ఎప్పుడో అవసరమైనప్పుడు ఆ కూరగాయల పాత్రలో వెతికి ఉన్న డబ్బుని తీసుకుంటారు. ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే లక్ష్మి దేవికి ఇవి నచ్చవు. డబ్బును ఎక్కడంటే అక్కడ పడేస్తే ఇంట్లో నుంచి మెల్లగా ఆమె జారుకుంటుంది. అందుకే డబ్బుని ఎక్కడపడితే పెట్టకూడదు. ప్రత్యేకించి కొన్ని దిక్కులలో మాత్రమే పెట్టాలని మనశాస్త్రాలు చెబుతున్నాయి.

Latest News