• జీవ హెల్త్ వీక్ సందర్భంగా దేశ వ్యాప్తంగా 10,000 మంది పేషెంట్లకు ప్రయోజనం
• వెల్‌నెస్ ఉత్పాదనలపై డిస్కౌంట్లు, ఉచిత సదుపాయాలు, హెల్త్ మ్యాగజైన్‌పై ప్రయోజనం పొందే అవకాశం,
జీవ ఆయుర్వేద యొక్క `జీవ ఆరోగ్య వారోత్సవం` మార్చి 9 నుంచి మార్చి 18 వరకు భారతదేశ వ్యాప్తంగా ఉన్న తన 80 కేంద్రాల్లో నిర్వహిస్తోంది. దాదాపు 10,000 మంది పేషెంట్లకు జీవ హెల్త్ వీక్ సందర్భంగా ప్రయోజనం చేకూరుతుంది. జీవ ఆయుర్వేద సంస్థ ఇప్పటివరకు కోటి కన్సల్టేషన్లను పూర్తి చేసింది. ఈ విజయపరంపరలో భాగంగా ఉచిత కన్సల్టేషన్ సౌకర్యం కల్పిస్తోంది. తన వెల్‌నెస్ ఉత్పాదనలపై డిస్కౌంట్ అందించడంతో పాటుగా తన త్రైమాసిక మాసపత్రిక అయిన `పరమయు` ఉచిత కాపీని అందిస్తోంది.
ఈ సందర్భంగా జీవ ఆయుర్వేద డైరెక్టర్ డాక్టర్ ప్రతాప్ చౌహాన్ మాట్లాడుతూ, “ ప్రతి ఏటా, జీవా ఆరోగ్యవారోత్సవాలను నిర్వహిస్తూ, ఉచిత కన్సల్టేషన్ ద్వారా అత్యంత నాణ్యమైన చికిత్సను అందిస్తున్నాం. గతంలోని ఆరోగ్య వారోత్సవాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకొని నగరంలోని నివసిస్తున్న వారి వరకు అందరి నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ ఏడాది సైతం జీవ వారోత్సవంలో ప్రజలు ప్రయోజనం పొందుతారని భావిస్తున్నాం“ అని తెలిపారు.
జీవ ఆయుర్వేద వేలాది మంది ప్రజలను వారి జీవనశైలి సంబంధిత, సుదీర్ఘకాల మరియు ఆయా సీజన్లలో వచ్చే వ్యాధుల బారిన పడిన వారికి చికిత్స అందించింది. వ్యక్తిగత అవసరాలకు తగిన మందులు అందిస్తూ, కస్టమైజ్డ్ డైట్ మరియు జీవనశైలికి సంబంధించిన ప్రతిపాదనలతో ప్రతి రోగికి విభిన్నమైన చికిత్స అందించింది. రోగం యొక్క లక్షణాలకు మాత్రమే చికిత్స అందించడం కాకుండా రోగ కారకం మూలం నుంచి చికిత్స అందించి వేలాది మందికి వారి అనారోగ్యాలను నయం చేసింది.
ఆయుర్వేదం యొక్క మౌలిక సూత్రాలను గమనంలో ఉంచుకుంటూనే నూతన టెక్నాలజీ ఆవిష్కరణలతో ఆయుర్వేద చికిత్స జీవ మరింత ద్విగుణీకృతం చేసింది. జీవ యొక్క ఆయునిక్ (Jiva’s Ayunique™) ఇలాంటి ఆవిష్కరణల్లో ఒకటి. ఆయునిక్ ద్వారా ఆయుర్వేద వైద్యులు సమస్యను గుర్తించడం మరియు చికిత్స అందించడంలో భాగంగా మరింత విశిష్టమైన విధానం పాటించగలరు. దీని వల్ల సంప్రదాయ ఆయుర్వేదం మరియు నూతన శాస్త్రీయ విధానాన్ని కలగలిపి వాటి ఫలితాలను అందుబాటులోకి తెచ్చేందుకు వీలు కలుగుతుంది. సాంకేతికతను సమ్మిళితం చేయడమనే ప్రక్రియలో భాగంగా, ఆయునిక్ సమగ్రమైన, వ్యక్తిగత ఆసక్తులకు తగిన, విలువైన చికిత్సను అందించడం సాధ్యమవుతుంది.
జీవ ఆయుర్వేదిక క్లినిక్ చిరునామాః
1-2-2/1, లిబర్టీ స్క్వేర్, హిమాయత్‌నగర్ రెడ్ లైట్ క్రాసింగ్, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎదురుగా, హైదరాబాద్.